గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 8 ఏప్రియల్ 2021 (17:49 IST)

డ్రామా జూనియర్స్- ది నెక్స్ట్ సూపర్ స్టార్‌తో మన ముందుకు జీ తెలుగు

ప్రకృతిని పులకరింపజేసే చైత్ర మాస ఆగమనంలో, శ్రీ శార్వరి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ స్వస్తి శ్రీ ప్లవ నామ సంవత్సరానికి అందరిని ఆహ్వానిస్తూ ఉగాది శుభాకాంక్షలను తెలుపుతుంది మన జీ తెలుగు.
 
ఉగాది అంటే కొత్త ఆశలకు ఆశయాలకు పెట్టింది పేరు. ఎప్పుడూ కొత్తదనంతో మనందరిని ఆకట్టుకునే జీ తెలుగు ఈసారి మరో కొత్త షోతో అందరిని అలరించడానికి మన ముందుకు వస్తుంది. డ్రామా జూనియర్స్- ఈ షో పేరు వినని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. చిన్నారులు ఎంతో ముచ్చటగా వారి ప్రతిభను ప్రదర్శించే చోటు జీ తెలుగు వారి డ్రామా జూనియర్స్. మరి ఈసారి ఇదే డ్రామా జూనియర్స్ మునుపెన్నడు చూడని విధంగా కొత్త హంగులతో డ్రామా జూనియర్స్- ది నెక్స్ట్ సూపర్‌స్టార్‌గా ఏప్రిల్ 11వ తేదీ రాత్రి 8 గంటలకు మొదలవబోతుంది.
 
ఇంతటి షోకి న్యాయనిర్ణేతలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, రచయిత, సంగీతదర్శకుడు, నటుడు ఎస్.వి. కృష్ణారెడ్డి మొట్టమొదటిసారిగా తెలుగు టెలివిజన్ లోని షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో రేణు దేశాయ్‌ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
 
ఒకప్పుడు నటిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రేణూ దేశాయ్ ఇప్పుడు ఈ షోకి మరో జడ్జిగా పగ్గాలు అందుకున్నారు. వీళ్ళతో పాటు... క్వీన్ ఆఫ్ మెలోడీ అని పేరు తెచ్చుకున్న మన సింగర్ సునీత గారు కూడా ఈ షోకి జడ్జిగా వ్యవహరించనున్నారు. మరి జడ్జెస్ ఇలా ఉంటే యాంకర్ ఎలా ఉండాలి? అదిరిపోవాలి కదా.... అందుకే మన అందరికి ఎంతో ఇష్టమైన ప్రదీప్ మాచిరాజు ఈ షోకి యాంకరింగ్ చేస్తున్నాడు.
 
మొట్టమొదటి సారిగా షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఎస్.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ, "డ్రామా జూనియర్స్ ఎప్పుడూ  సరికొత్త టాలెంట్‌ను బయటకు తీసుకొస్తుంది. ఈ షోలో భాగం అయినందుకు నాకు చాల ఆనందంగా ఉంది. నేను మంచి పర్ఫార్మెన్స్‌లతో పాటు ఎంతో గొప్ప నటుల కోసం ఎదురుచూస్తున్నాను."