సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 17 జనవరి 2017 (04:55 IST)

ఓవర్సీస్‌లో సత్తా చాటుతున్న తెలుగు సినిమాల హవా

కొంతమంది స్టార్ హీరోలు, కొన్ని కథా ప్రాధాన్యమున్న చిత్రాలు అమెరికాలో చాలా బాగా ఆడుతుండటంతో ఓవర్సీస్ పంపిణీదారులకు కాసుల పంట పండుతోంది. గత వారం బాక్సాఫీసులో నాలుగు సినిమాలు విడుదలైతే దాదాపు అన్నీ మంచి కలెక్షన్లను సాధించాయి.

ఈరోజుల్లో భారతీయ సినిమాలను ఓవర్సీస్‌లో విడుదల చేయడం అతిపెద్ద బిజినెస్‌గా మారింది. కొంతమంది స్టార్ హీరోలు, కొన్ని కథా ప్రాధాన్యమున్న చిత్రాలు అమెరికాలో చాలా బాగా ఆడుతుండటంతో ఓవర్సీస్ పంపిణీదారులకు కాసుల పంట పండుతోంది. గత వారం బాక్సాఫీసులో నాలుగు సినిమాలు విడుదలైతే దాదాపు అన్నీ మంచి కలెక్షన్లను సాధించాయి. తాజా గణాంకాల ప్రకారం అమెరికా బాక్సాఫీసులో గత ఆరు రోజుల్లో 4 మిలియన్ డాలర్లు వసూలయ్యాయి. ఇది భారీ మొత్తం.  
 
దీంట్లో ఒక తెలుగు సినిమాలదే అధిక వాటా అని సమాచారం. గత వారం విడుదలైన ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి సినిమాల మొత్తం కలెక్షన్లు 3.73 మిలియన్ డాలర్లు. ఇక తమిళ సోలో సినిమా భైరవ చాలా తక్కువ వసూళ్లు రాబట్టడం విశేషం. 
 
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా నేటికీ మంచి కలెక్షన్లను రాబడుతోంది. దీంతో బాలయ్య 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేస్తుందని అంచనా.  చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమా ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను దాటిపోయందని సమాచారం. ఇది సీనియర్ నటుల పవర్‌ని చాటి చెబుతోంది.

అమెరికాలో తెలుగు సినిమాల పాపులారిటీ రాన్రానూ పెరుగుతోందని ఇది సూచిస్తోంది. ఇప్పుడు దక్షిణాది సినిమాలు బాలివుడ్ సినిమాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. కలెక్షన్లలో కానీ, కేటాయిస్తున్న థియేటర్ల విషయంలో కానీ తెలుగు సినిమాలు బాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతుండటం ముదావహం.