ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 16 మార్చి 2017 (21:53 IST)

ఎఫైర్స్, సెక్స్ రాకెట్ వార్తలు రాసి జీవితాలు నాశనం చేస్తున్నారు... నటి హేమ ఫైర్

క్యారెక్టర్ ఆర్టిస్టు హేమ మీడియాపై మండిపడ్డారు. ఎవరి పైనైనా ఆరోపణలు వస్తే వెంటనే దాన్ని చిలువలుపలవలుగా చేసేసి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు. ఇలాంటి వార్తల వల్ల వారి జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అలాంటి వార్తలను రాయవద్దని, ప

క్యారెక్టర్ ఆర్టిస్టు హేమ మీడియాపై మండిపడ్డారు. ఎవరి పైనైనా ఆరోపణలు వస్తే వెంటనే దాన్ని చిలువలుపలవలుగా చేసేసి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు. ఇలాంటి వార్తల వల్ల వారి జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అలాంటి వార్తలను రాయవద్దని, ప్రసారం చేయవద్దని అభ్యర్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
 
మీడియాలో ఇలాంటి వార్తలు రాసి, ప్రసారం చేయడం వల్ల వాళ్ల రేటింగులు పెంచుకోవచ్చేమో కానీ ఆరోపణలు ఎదుర్కొనే వారి జీవితాలు మాత్రం నాశనమవుతాయని అన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని అన్నారు.