శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 2 డిశెంబరు 2019 (21:22 IST)

బ‌న్నీ సౌత్ ఇండియా రికార్డ్, ఇంత‌కీ.. ఆ రికార్డ్ ఏంటి..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన’ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటకు ఇప్పటివరకు యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. సౌత్ ఇండియాలో ఒక పాటకు ఇన్ని వ్యూస్ రావడం ఇదే ప్రథమం.
 
రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించిన తెలుగు పాటకు నెటిజన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ పాటకు లక్షల్లో టిక్ టాక్‌లు చేసి ఈ పాటను భారీ హిట్ చేశారు. సుప్రసిద్ధ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ గీతానికి తమన్ అద్భుతమైన ట్యూన్ అందించారు. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఇప్పటికీ విశేష ఆదరణకు నోచుకుంటోంది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయిలో మిలియన్స్‌లో వ్యూస్, లక్షల్లో లైక్స్ రావడం విశేషం.
 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.