మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 23 మే 2017 (19:20 IST)

యాంకర్ రవి చాలా మంచోడు... 'పటాస్' షో శ్రీముఖి

రారండోయ్ వేడుక చూద్దాం... ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతి రావు వ్యాఖ్యల తర్వాత వాటిని సమర్థిస్తున్నట్లుగా పటాస్ ఫేమ్ యాంకర్ రవి సూపర్ అని కితాబివ్వడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పటాస్ షోలో అతడితో కలిసి పనిచేస్తున్న యాంకర్ శ్రీముఖి మ

రారండోయ్ వేడుక చూద్దాం... ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతి రావు వ్యాఖ్యల తర్వాత వాటిని సమర్థిస్తున్నట్లుగా పటాస్ ఫేమ్ యాంకర్ రవి సూపర్ అని కితాబివ్వడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పటాస్ షోలో అతడితో కలిసి పనిచేస్తున్న యాంకర్ శ్రీముఖి మాట్లాడింది.
 
చలపతిరావు మాటలను సరిగా వినలేదని యాంకర్ రవి చెప్పారనీ, ఏదో పంచ్ వేసి వుంటారనుకుని సూపర్ అని చెప్పారని వెల్లడించారు. తనకు తెలిసినంత వరకూ యాంకర్ రవి చాలా మంచివారనీ, ఆయనకు స్త్రీలంటే ఎంతో గౌరవమని ఆమె చెప్పుకొచ్చారు. ఇక చలపతి రావు గారు మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేసి వుండాల్సింది కాదని ఆమె అన్నారు.