గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మే 2022 (17:35 IST)

బెంగాల్‌లో యువ నటి ఆత్మహత్య

bidisha de majumdar
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువ నటి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను బిదిషా దే మజుందార్‌గా గుర్తించారు. వయసు 21 యేళ్లు. కోల్‌కతాలోని తన అపార్ట్‌మెంటులో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. 
 
తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించిన పోలీసులు మజూందార్ మృతదేహాన్ని కిందికి దించి శవపంచానామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేగానీ, ఆమె మృతిపై ఒక స్పష్టత వస్తుందని పోలీసులు వెల్లడించారు. 
 
మరోవైపు, ఆమె గది నుంచి ఓ సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బిదిషాకు అనుభవ్ బేరా అనే ప్రియుడు ఉన్నట్టు తెలుస్తంది. అతడితో ప్రేమ వ్యవహారం కారణంగానే బిదిషా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.