శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (17:22 IST)

భావన కేసు.. మలయాళ హీరో ఇంట్లో దాగివున్న నిందితుడు.. అరెస్టయ్యాడా?

మలయాళ హీరోయిన్ భావన్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్. భావన కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ఓ హీరో ప్రమేయమున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడు పట్టుబడినట్లు సమాచారం.

మలయాళ హీరోయిన్ భావన్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్. భావన కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ఓ హీరో ప్రమేయమున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడు పట్టుబడినట్లు సమాచారం. ఈ ప్రధాన నిందితుడు భావన కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంట్లోనే తలదాచుకున్నాడని పోలీసులు చెప్తున్నారు.  
 
భావన కిడ్నాప్, లైంగిక దాడి కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. భావనపై దాడి ఘటనని మలయాళ ఇండస్ట్రీ పెద్దలు సైతం వ్యతిరేకించారు. భావనకి మద్దతుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పుడిదే పరిశ్రమకి వ్యక్తులు భావన కిడ్నాప్‌కి కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది.
 
ఇప్పటికే భావన కిడ్నాప్ కేసులో మలయాళ హీరో హస్తం ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడిదే హీరో ఇంట్లో ఈ కేసులోని ప్రధాన నిందితుడు పట్టుపడినట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో.. హీరోయిన్ కేసులో హీరో హస్తం ఉందన్న ఆరోపణలకు బలం చేకూరినట్లైంది.