జనవరి 12న భారీ స్థాయిలో ఆదిపురుష్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ "ఆదిపురుష్" అనే ఒక హై బడ్జెట్ విజువల్ వండర్ సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రామాయణ ఇతిహాసం ఆధారంగా చాలా తెలియని కొత్త కోణాలను చూపే ప్రయత్నంగా మేకర్స్ ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు.
అనుకున్న విధంగానే ఈ భారీ సినిమా విడుదలకి వాయిదా వేశారు. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ కావాల్సి ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
ఈ మహాశివరాత్రి సందర్భంగా తమ సినిమా నుంచి ఈ అప్డేట్‌ని అందిస్తున్నట్టుగా తెలియజేశారు. సో ప్రభాస్ నుంచి ఈ ఏడాది ఓ సినిమా స్కిప్ అయ్యిందని చెప్పాలి.