మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2017 (16:54 IST)

చెప్పులేసుకుని గాయత్రీ మంత్రాన్ని పఠిస్తారా? బన్నీకి, హరీష్‌కు ఆ విషయం తెలియదా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ సినిమాను వివాదాలు వెంటాడుతూ వున్నాయి. మొన్నటి వరకు నమకం, చమకం పదాలను శృంగార అర్థంలో వాడారంటూ నిరసన వ్యక్తం చేసిన బ్రాహ్మణ సంఘాలు.. ప్రస్తుతం ఆ వివాదం ము

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ సినిమాను వివాదాలు వెంటాడుతూ వున్నాయి. మొన్నటి వరకు నమకం, చమకం పదాలను శృంగార అర్థంలో వాడారంటూ నిరసన వ్యక్తం చేసిన బ్రాహ్మణ సంఘాలు.. ప్రస్తుతం ఆ వివాదం ముగిశాక.. మరో వివాదానికి తావిచ్చారు. ఈ చిత్రంలో గాయత్రీ మంత్రాన్ని అవమానించారంటూ.. బ్రాహ్మణ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. 
 
యజ్ఞోపవీతం చేసే సమయంలో గాయత్రి మంత్రాన్ని పఠిస్తారు. అలాంటి పవిత్రమైన మంత్రాన్ని హీరోతో చెప్పులేసుకుని మంత్రింపజేయించారని బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. దర్శకుడు బ్రాహ్మణుడైనప్పటికీ.. గాయత్రీ మంత్రానికి ఎంతటి పవిత్రత వున్న విషయం తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. తాను బ్రాహ్మణుడని గొప్పలు చెప్పుకుంటున్న హరీష్.. పెద్ద తప్పు చేశాడని.. అతనో స్వయం ప్రకటిత మేధావి అని ఎద్దేవా చేశారు. 
 
ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఆ సీన్లో చెప్పులేసుకుని గాయత్రి మంత్రాన్ని హీరో చదవడం ఏమిటని వారు అడుగుతున్నారు. చెప్పులేసుకుని గాయత్రి మంత్రాన్ని జపించకూడదనే విషయం హీరో అల్లు అర్జున్‌కి తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇందుకు సెన్సార్ బోర్డు వాళ్లు ఎలా ఒప్పుకున్నారని బ్రాహ్మణ సంఘాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, సెన్సార్ బోర్డులో రాజకీయాలు ఎక్కువగా రాజకీయాలున్నాయని బ్రాహ్మణ సంఘాలు విమర్శించాయి.