గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (11:31 IST)

'ఖైదీ నంబర్ 150లో మెగాస్టార్ ఇరగదీశాడట.. ఫ్యాన్స్ కేరింతలు

మెగాస్టార్ 'చిరంజీవి' ఎవర్ గ్రేట్.. ఆయన డ్యాన్సులు.. ఫైట్లు సూపర్బ్.. ఇవి ఆయన తాజా చిత్రం 'ఖైదీ నెంబర్ 150'లో కూడా ఇరగదీశాడట. డ్యాన్సుల్లో కుర్రకారు హీరోలకు సవాల్ విసిరాడని అంటున్నారు. సినిమా చాలా బాగ

మెగాస్టార్ 'చిరంజీవి' ఎవర్ గ్రేట్.. ఆయన డ్యాన్సులు.. ఫైట్లు సూపర్బ్.. ఇవి ఆయన తాజా చిత్రం 'ఖైదీ నెంబర్ 150'లో కూడా ఇరగదీశాడట. డ్యాన్సుల్లో కుర్రకారు హీరోలకు సవాల్ విసిరాడని అంటున్నారు. సినిమా చాలా బాగుంది' అంటూ అభిమానులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ప్రపంచ వ్యాప్తంగా 'ఖైదీ నెంబర్ 150' సినిమా విడుదలైంది.
 
మరోవైపు.. ఖైదీ నెంబర్‌ 150 సినిమా రిలీజ్‌ సందర్భంగా థియేటర్ల దగ్గర మెగా మానియా కనిసిస్తోంది. సినిమా చూసేందుకు అభిమానులు భారీసంఖ్యలో థియేటర్ల దగ్గరకు చేరుకుంటున్నారు. నగరంలో మెగాఫ్యాన్స్‌ అర్థరాత్రి నుంచే థియేటర్ల వద్ద బారులు తీరారు. దాదాపు దశాబ్దం తర్వాత సిల్వర్‌స్రీన్‌పై చిరు డైనమిజాన్ని చూడ్డానికి అభిమానులు ఉత్సాహపడుతున్నారు. 
 
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, విదేశాల్లో కూడా మెగా మానియా కనిపిస్తోంది. కార్లతో భారీ ర్యాలీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు అమెరికాలోని చిరు ఫ్యాన్స్. ఒమాహాకి చెందిన చిరు అభిమానులు కార్లతో భారీ ర్యాలీని చేపట్టి, ఆ తర్వాత విశాలమైన ప్రాంతంలో తమ కార్లతో CHIRU అనే పేరుని డిజైన్ చేశారు. అటు హ్యూస్టన్‌లో గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణ ఫ్యాన్స్ తమ ప్రచారాన్ని వేగం పెంచారు.