శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (12:20 IST)

సిండ్రెల్లా, షాంగ్-చి, బ్లాక్ విడో సరి కొత్త కానుకలతో వీక్ ఎండ్ కి సిద్ధం కండి

hollywood movies
ప్రపంచ చలనచిత్రం కానివ్వండి లేదా మరే ప్రదర్శన ఐనా కానివ్వండి, వీటి పట్ల అమితంగా ఇష్టపడే అభిమానులకు ఈవీక్ ఎండ్ లో 5 తాజా కానుకలు అందబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కి చెందిన సిండ్రెల్లా, మార్వెల్స్ షాంగ్-చి మరియు లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్, బ్లాక్ విడో, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 మరియు నెట్‌ఫ్లిక్స్ వారి మనీ హీస్ట్సీ జన్ 5 లు ఇందులో ఉన్నాయి. 
 
వాటి గురించి - క్లుప్తంగా ..
థియేటర్ కి సంబందించిన విడుదలలు: మార్వెల్ యొక్క మొట్టమొదటి ఆసియన్ సూపర్ హీరో
మూవీ, షాంగ్-చి, ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్, పూర్తి - ఆసియ తారాగణం తోటి చిత్రాలు
మిమ్మల్ని మళ్ళీ థియేటర్స్ వేపు ఆకర్షించనున్నాయి. సిము లియు, ఆక్వాఫినా, మెంగేర్ జాంగ్, ఫలా చెన్, బెనెడిక్ట్ వాంగ్, మిచెల్ యో, మరియు టోనీ ల్యూంగ్ లు నటించిన ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషల్లో విడుదల అవబోతోంది! మరి 3 సెప్టెంబర్ 2021 నుంచి థియేటర్లలో షాంగ్- చి ని చూడ్డానికి తయారవండి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీ కి చెందిన తొమ్మిదవ పార్ట్, ఫాస్ట్ 9, ఆఖరుకి ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో ఇండియాకి కూడా వస్తోంది. జాన్ సెనా, కార్డి బి, చార్లిజ్ థెరాన్‌ తదితరుల తో పాటు విన్ డీజిల్ మరియు మిచెల్ రోడ్రిగ్స్ నటించిన ఈ ఫాస్ట్ అండ్ఫ్యూ రియస్ 9 మూవీ , సెప్టెంబర్ 2, 2021 న థియేటర్లలో విడుదల కానుంది.
 
OTT కి సంబందించిన ప్రదేశాల్లో : అద్భుత కథనం తోటి ఆధునికంగా చెప్పబడ్డ, అమెజాన్ ఒరిజినల్మూవీ సిండ్రెల్లా - ప్రధాన పాత్రలో కెమిలా కాబెల్లో నటించారు. ప్రతిష్టాత్మకమైన, ధైర్యవంతురాలైన మరియు తనను తాను మొదటి స్థానంలో ఎల్లప్పుడూ ఉంచుకునే ఈ ఆధునిక-సిండ్రెల్లా, బేస్‌మెంట్ దశ నుండి బయటపడి, తన స్వంత వ్యక్తిత్వం తో జీవితాన్ని గడపాలని కోరుకునే మహిళ. కే కానన్ దర్శకత్వం వహించిన సిండ్రెల్లా, ఈ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, బిల్లీ పోర్టర్ మరియు పియర్స్ బ్రోస్నన్‌తో పాటు కెమిలా, ఇడినా మెన్జెల్, మిన్నీ డ్రైవర్, నికోలస్ గాలిట్జైన్ గార్లు నటించారు. స్కార్లెట్ జోహన్సన్ నటించిన బ్లాక్ విడో అంతర్జాతీయంగా విడుదలైన తర్వాత ఇప్పటికి ఇండియాలో విడుదల అవుతోంది. విదేశాలలో సంచలనం సృష్టించిన ఈ మార్వెల్ చిత్రం చివరకు ఇండియన్ ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ అందించడానికి డిస్నీ+హాట్స్టా ర్‌లో సెప్టెంబర్ 3 న విడుదల కానుంది. 5 ఎపిసోడ్‌లతో కూడిన సీజన్ 5 యొక్క మొదటి భాగం సెప్టెంబర్ 3 న విడుదలవుతుంది మరి రెండో ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ 3 న ప్రీమియర్ కాబోతుంది . నెట్‌ఫ్లిక్స్‌లో సీజన్ 5 చూసి ఆనందించండి.