1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 5 జూన్ 2016 (11:35 IST)

అనుష్క, నయన పోతే పోనీ... దీపికాను ఓకే చేసిన మెగాస్టార్.. 150లో ఉత్తరాది భామ!

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు హీరోయిన్ దొరికిందట. నయనతార, అనుష్క నో చెప్పిన తర్వాత చిరంజీవి 150వ సినిమా 'కత్తిలాంటోడు'లో ఆయనకు జోడీగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

15 ఏళ్ల విరామం తర్వాత చిరంజీవి సిల్వర్ స్క్రీన్పై కనిపించబోతుండటంతో దక్షిణాది హీరోయిన్లను ఎంపిక చేసేందుకు చిరంజీవి అండ్ టీమ్ ఎన్నో కసరత్తులు చేసింది. కానీ దక్షిణాది టాప్ హీరోయిన్లు కాల్షీట్లతో బిజీ కావడంతో ఇక చేసేది లేక ఉత్తరాది హీరోయిన్‌ను తీసుకునేందుకు చెర్రీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  
 
కత్తిలాంటోడు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అనుష్క, నయనతార, త్రిష పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరికి దీపికా పదుకునేను ఓకే చేసినట్లు సమాచారం. చిరంజీవి 150 సినిమాకు జోడీగా దీపికను సంప్రదించినట్లు సినిమా యూనిట్ వెల్లడించింది. ఇకపోతే.. వీవీ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.