శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2024 (19:03 IST)

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

Drinker Sai thanks meet
Drinker Sai thanks meet
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "డ్రింకర్ సాయి". ఇటీవలే విడుదలైంది. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆడియెన్స్ ఆదరణతో విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ విషయాలను తెలియజేస్తూ చిత్ర యూనిట్ సమావేశం ఏర్పాటు చేసింది.
 
హీరో ధర్మ మాట్లాడుతూ - ఈ సినిమాతో నేను యూత్ ను చెడగొట్టలేదు అనే పేరొచ్చింది చాలు. ఒక మంచి మెసేజ్ తో మూవీ చేశాం. మహిళలకు, ఫ్యామిలీస్ కు మూవీ నచ్చడం సంతోషంగా ఉంది. కొందరు ఫస్టాఫ్ బాగుందని, మరికొందరు సెకండాఫ్ బాగుందని అంటున్నారు. ఏరియా వైజ్ గా రెస్పాన్స్ చూస్తే అందరి దగ్గర నుంచీ మూవీ బాగుందనే టాక్ వస్తోంది. మా డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారంటే అంతకంటే సంతోషం లేదు. మా టీమ్ అంతా బాగా పర్ ఫార్మ్ చేసిందంటే అందుకు మా డైరెక్టర్ కిరణ్ గారే కారణం. మా మూవీని ఆదరిస్తున్న మహిళా ప్రేక్షకుల కోసం టికెట్స్ ను ఉచితంగా ఇవ్వబోతున్నా.  అన్నారు.
 
డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ, మనం జీవితంలో చేసే తప్పులు కొన్ని ఆలస్యంగా తెలుసుకుంటాం. అప్పుడు తెలుసుకుని ప్రయోజనం ఉండదు. మా మూవీలో హీరో ధర్మ అలాగే ఒక తప్పు చేస్తాడు. అది తెలుసుకునేలోగా నష్టం జరుగుతుంది. అలా మీలో ఎవరి లైఫ్ లో జరగొద్దు అనే మంచి సందేశాన్నిస్తూ ఈ మూవీ చేశాను. ఈ వీకెండ్ మీరు థియేటర్స్ కు వెళ్లాలనుకుంటే పుష్ప 2 తప్ప మరో సినిమా లేదు. ఒకసారి మా మూవీ చూడండి. నచ్చితే పదిమందికి చెప్పండి. ఫ్యామిలీతో వెళ్లండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సుదర్శన్ థియేటర్ లో మా సినిమా సెకండ్ డే కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఆడియెన్స్ నుంచే రివ్యూస్ తీసుకోబోతున్నాం. ఈ కాంటెస్ట్ ద్వారా సెలెక్ట్ అయిన వారికి డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు. అలాగే ఆడియెన్స్ దగ్గరకు మా మూవీ గురించి చెప్పుకునేందుకు థియేటర్స్ విజిట్ కు వెళ్తున్నాం. "డ్రింకర్ సాయి" మూవీని ప్రతి ఆడియెన్ కు చేర్చాలనేదే మా ప్రయత్నం. అన్నారు.
 
ప్రొడ్యూసర్ బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ,  డ్రింకర్ సాయి టైటిల్ తో సినిమా చేసినప్పుడు కొందరు మిత్రులు సందేహాలు వెలిబుచ్చారు. కానీ ఈ సినిమా ద్వారా ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నామని వారికి చెప్పాను. మంత్రి శ్రీధర్ బాబు గారు మా మూవీ పోస్టర్ లాంఛ్ చేశారు. డ్రింకర్ సాయి సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. మేము పెట్టిన పెట్టుబడి సేఫ్ అయ్యింది. లాభాలు కూడా వస్తాయి. అయితే వీటన్నింటికంటే ఒక మంచి సందేశాత్మక సినిమా చేశామనే సంతృప్తి ఉంది అన్నారు.