గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 21 జులై 2018 (14:02 IST)

బీజేపీలో 'ఈరోజుల్లో' హీరోయిన్ రేష్మ... పాలమూరు నుంచి పోటీ

"ఈరోజుల్లో" చిత్ర హీరోయిన్ రేష్మ రాథోడ్. ఒక్క చిత్రంతోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఆమె రాజకీయాలపై దృష్టిసారించింది. బీజేపీ

"ఈరోజుల్లో" చిత్ర హీరోయిన్ రేష్మ రాథోడ్. ఒక్క చిత్రంతోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఆమె రాజకీయాలపై దృష్టిసారించింది. బీజేపీ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలయ్యారు. ఆ పార్టీ తరపున ఆమె వివిధ రకాల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
 
ఈ నేపథ్యంలో ఆమె వైరా నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఇటీవల కారేపల్లి మండలంలో పలుప్రాంతాల్లో పర్యటించారు. ఆమె సమీప బంధువులను తరచుగా కలుస్తున్నారు. వైరా నియోజకవర్గం నుంచి కాకుండా బీజీపీ అధిష్టానం మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
గత ఎన్నికల్లో పాలమూరు స్థానం నుంచి ప్రొఫెసర్‌ సీతారాం గెలుపొందారు. ఈనేపథ్యంలో ఎస్టీ ఓట్లను పొందేందుకు రేష్మను బీజేపీ రంగంలోకి దించేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. సినీతార పైగా ఈ ప్రాంత వాసులతో సంబంధబాంధవ్యాలుండటం, గిరిజన యువతి కావడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.