గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (18:34 IST)

తెలుగు సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడుతుందని ఫిలింఛాంబర్ ప్రకటన

Film chaber kamity
Film chaber kamity
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ప్రాతినిధ్యం వహిస్తున్న అపెక్స్ బాడీ అయిన తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, 02-10-2024 నాడు మీడియాలో తెలంగాణకు చెందిన ఒక గౌరవనీయ మహిళా మంత్రి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తుల  వ్యక్తిగత జీవితాలకు సంబంధించి చేసిన అభ్యంతరకరమైన, ధృవీకరించబడని మరియు వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల బాధ మరియు ఆవేదనను వ్యక్తం చేస్తుంది. 
 
గత కొన్ని సంవత్సరాలుగా, తెలుగు సినీ సెలబ్రిటీలు మరియు ఇతర తెలుగు ఫిల్మ్ ఫ్రాటర్నిటీ సభ్యులు చాలా మందికి సులువైన టార్గెట్ గా మారారు. ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసం తెలుగు సినిమాకు సంబంధించిన వ్యక్తులపై చేసిన దుర్మార్గమైన మరియు హేయమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మొత్తం తెలుగు సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడుతుందని తెలియజేయుచున్నాము అని తెలుగు, తెలంగాణ చలనచిత్రవాణిజ్య మండలి ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్ ఓ ప్రకటనలో తెలియజేశారు.