శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (09:42 IST)

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

ANR statue at studio
ANR statue at studio
అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని విగ్రహం వద్ద ఆయనకు ఆయన అభిమానులు నివాళులర్పించారు. అనంతరం అక్కినేని గురించి అభిమానులు తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. సెప్టెంబర్  20న ఆయన జయంతి సందర్భంగా దాదాపు 600 మంది సీనియర్ అభిమానులు హాజరయ్యారు.
 
అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు. ఫ్యాన్స్ అందరితో కలిసి భోజనాలు చేసి, 600 వందల మంది సీనియర్ అభిమానులకు బట్టలు బహుకరించారు.  దేశవ్యాప్తంగా ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరుపనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరబాద్ లో 'దేవదాసు' 4K స్క్రీనింగ్ తో ఫెస్టివల్‌ ఘనంగా ప్రారంభించారు. సినీమ్యాక్స్ లో ఇది జరిగింది. మూడు రోజుల పాటు 31 సిటీస్ లో ANR గారి 10 ఐకానిక్ మూవీస్ ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శన చేయనున్నారు.  అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు గారి పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు. అదే విధంగా గోవా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ANR గారి శత జయంతిని ఘనంగా  భారత ప్రభుత్వం సెలబ్రేట్ చేయబోతుంది.