శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (10:44 IST)

అక్కినేని నాగేశ్వరరావు ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ : నందమూరి బాలకృష్ణ

ANR, Balayya
ANR, Balayya
నేడు అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా అక్కినేని కుటుంబం ఈరోజు సాయంత్రం ఓ వేడుకను బంజారా హిల్స్ లోని థియేటర్ లో గ్రాండ్ గా అభిమానుల సమక్షంలో ఫంక్షన్ చేయనుంది. అక్కినేని నటించిన పలు సినిమాల గురించి విశ్లేషిస్తూ, సరికొత్త ప్రణాళికను అక్కినేని అక్కినేని నాగార్జున వెల్లడించనున్నారు. ఇప్పటికే ఎ.ఎన్. ఆర్. పేరిట నెలకొల్పిన జాతీయస్థాయి అవార్డు ఫంక్షన్ ను కొంతకాలం నిలిపివేశారు. 
 
తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం.మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు.ఆయన కృషి, కీర్తి, మరియు స్ఫూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా, తెలుగు సినీరంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం. 
 
నాటకరంగం నుండి చిత్రరంగం వరకు, ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ. ఈ రోజు, ఆయనకు మనమందరం నివాళి అర్పిస్తూ, ఆయన నటన, కృషి, మరియు పట్టుదలతో వెలసిన విజయాలను స్మరించుకుందాం అని నందమూరి బాలకృష్ణ ప్రకటనలో తెలిపారు.