మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2024 (09:55 IST)

ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయడం చట్ట విరుద్ధం: అక్కినేని నాగార్జున

n convention
తమ కుటుంబానికి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయడం చట్టవిరుద్ధమని హీరో అక్కినేని నాగార్జున అంటున్నారు. పైగా, ఈ కన్వెన్షన్ సెంటర్‌పై ఇప్పటికే స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులు ఉన్నాయని వాటికి విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి చట్టవిరుద్ధంగా కూల్చివేతలను చేయడం బాధాకరమన్నారు. తన కీర్తి ప్రతిష్టను రక్షించడం కోసం కొన్ని వాస్తవాలను రికార్డ్ చేయడానికి, చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు తీసుకోలేదని సూచించడానికి ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
ఆ భూమి పట్టా భూమి కాగా, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనానికి సంబంధించి, కూల్చివేత కోసం ఇంతకుముందు ఏదైనా అక్రమ నోటీసుపై స్టే ఆర్డర్ మంజూరు చేసినట్టు తెలిపారు. ఇపుడు స్పష్టంగా, తప్పుడు సమాచారం ఆధారంగా కూల్చివేతను తప్పుగా పేర్కొంటున్నట్టు తెలిపారు. శనివారం ఉదయం కూల్చివేతకు ముందు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని తెలిపారు. 
 
చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కేసు పెండింగ్‌లో ఉన్న కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత పనులను తానే నిర్వహించేవుండేవాడినని తెలిపారు. మేము చేసిన తప్పుడు నిర్మాణాలు లేదా ఆక్రమణల గురించి ఏదైనా ప్రజల అపోహను సరిదిద్దే ఉద్దేశ్యంతోనే ఈ వివరణ ఇస్తున్నట్టు తెలిపారు. అధికారులు చేసిన తప్పుడు చర్యలకు సంబంధించి మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అక్కినేని నాగార్జున విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.