సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 23 జూన్ 2018 (13:56 IST)

'మీ బరువు బాధ్యత ఎప్పుడూ నాదే మేడం' అంటున్న అర్జున్ రెడ్డి

"అర్జున్ రెడ్డి" చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం "గీత గోవిందం". ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి పరశురాం దర

"అర్జున్ రెడ్డి" చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం "గీత గోవిందం". ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఇందులో విజయ్ దేవరకొండ సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ చూస్తే ఎంత ఆసక్తిగా ఉంది. పైగా, ఈ చిత్రం యూత్‌ఫుల్ లవ్ స్టోరీ కథగా కనిపిస్తోంది. ఫేసుల్లో ఫ్రెష్ లుక్ ఉంది. 
 
ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా హీరో విజయ్ పెట్టిన కామెంట్ హల్ చల్ చేస్తోంది. "నా కాళ్లు తిమ్మిరి ఎక్కినా.. నడుము నొప్పిలేచినా.. మీ బరువు బాధ్యత ఎప్పుడూ నాదే మేడం" అంటూ హీరోయిన్ రష్మికను ఉద్దేశించి చెప్పాడు. పోస్టర్ చూసినా అదే ఫీలింగ్ కనిపిస్తోంది.
 
'గీత గోవిందం' టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉంది. అందుకు తగ్గట్టుగా ఫస్ట్ లుక్ అదే స్థాయిలో మూవీపై అంచనాలను పెంచేసింది. ఈ మూవీకి సంగీత బాణీలను గోపి సుందర్ సమకూర్చుతున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ.. త్వరలోనే విడుదలకు సిద్ధంకానుంది.