సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2023 (19:22 IST)

కాంతారా-2లో ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్.. మంగళవారం హీరోయిన్

Kanthara
"కాంతారావు‌" చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్‌గా "కాంతారావు: చాప్టర్-1" తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిషబ్ శెట్టి విడుదల చేశారు. 
 
మరోవైపు ఈ సినిమాలో నటీనటుల కోసం ఆడిషన్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో తెలుగులో తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్న నటి పాయల్ రాజ్‌పుత్.. తనకు ‘కాంతారావు-1’లో అవకాశం ఇవ్వాలని హీరో రిషబ్ శెట్టికి, ఆ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌కి ట్వీట్ చేసింది. పాయల్ రాజ్‌పుత్ నటించిన ‘మంగళవారం’ సినిమా చూసి అవకాశం ఇవ్వాలని కోరింది.
 
“రిషబ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్. "కాంతారావు-2" కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని నాకు తెలిసింది. నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని ఆశిస్తున్నాను. ఇటీవల విడుదలైన ‘మంగళవారం’ చిత్రంలో నా నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. మీరు కాస్త సమయం కేటాయించి నా సినిమా చూస్తే కృతజ్ఞతలు తెలుపుతాను. ఈ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ కోసం ఏమి చేయాలో దయచేసి నాకు చెప్పండి. నా పేరును రీపోస్ట్ చేయడం ద్వారా సహకరిస్తున్న అభిమానులకు నా ధన్యవాదాలు" అని పాయల్ రాజ్‌పుత్ తెలిపింది. 
 
చాలా మంది నెటిజన్లు పాయల్ రాజ్‌పుత్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తున్నారు. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అలాగే ముఖ్యంగా కాంతారా దర్శకుడు రిషబ్ శెట్టి ‘ఆమె ట్వీట్‌కి మీరు రిప్లై ఇవ్వగలరు’ అంటూ హోంబలే ఫిల్మ్స్‌ను ట్యాగ్ చేశారు. 
 
ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ‘గోల్‌మాల్‌, ఏంజెల్‌, కిరాతక చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు, అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మిస్టీరియస్ థ్రిల్లర్ మంగళవారం త్వరలో ఓటీటీలో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది. 
 
ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ డిస్నీ+హాట్‌స్టార్ ఇప్పటికే సొంతం చేసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.