శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (15:49 IST)

రానా, మిహీకా ఇంట్లో పెళ్లి భాజాలు... డిసెంబరులో కాదు.. ఆగస్టులోనే?

టాలీవుడ్ హీరో రానా, మిహీకా ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ముహూర్తం ఆగస్టు 8 అని తెలుస్తోంది. కరోనా పరిస్థితుల దృష్ట్యా తమ పెళ్లిని నిరాడంబరంగా చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. పెళ్లి వేదిక ఎక్కడనేది ఇంకా తెలియరాలేదు. ఈ వేడుకకు వారి ఇరు కుటుంబాల్లోని అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
 
హీరో రానా దగ్గుబాటి తన ప్రేమ వ్యవహారాన్ని ఓపెన్‌గా చెప్పి టాలీవుడ్‌కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. మిహిక బజాజ్‌తో ప్రేమలో ఉన్న రానా తమ ఇద్దరి ప్రేమను ఇరు వైపులా అంగీకరించడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. అయితే ఈ నెల 21న రానా, మిహికా బజాజ్ నిశ్చితార్ధం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
అయితే రానా తండ్రి సురేష్ బాబు వారిద్దరి పెళ్లి ఈ ఏడాదిలోనే ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆ పెళ్లి డేట్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం మన దగ్గర కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో కొద్ది మంది బంధువులు మధ్యే ఈ పెళ్లి జరుగుతుందని టాక్ వస్తోంది.