గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (13:20 IST)

పెదవి విప్పే ముందే క్షుణ్ణంగా ఆలోచించాలి : హీరో వెంకటేష్

మనం ఏదైనా ఒక విషయం గురించి పెదవి విప్పేముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి అంటూ టాలీవుడ్ హీరో వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ఓ ట్వీట్ రూపంలో వెల్లడించారు. 
 
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా పేరుగాంచిన అక్కినేని నాగ చైతన్య - సమంతల జోడీ విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఈ వార్త టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలను ఒకింత షాక్‌కు గురిచేసింది.
 
వీరు తీసుకున్న నిర్ణయంపై అక్కినేని కుటుంబానికి చెందిన పలువురు, సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. వాళ్లిద్దరూ విడిపోవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే తాజాగా నటుడు వెంకటేశ్‌ పెట్టిన ఓ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట్లో  వైరల్‌గా మారింది. ‘మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి’ అంటూ వెంకీ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. వీరిద్దరి అంశం గురించే పోస్ట్ పెట్టివుంటారని భావిస్తున్నారు.