శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2024 (18:33 IST)

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

Kadambari Kiran, Dr. Saisree and others
Kadambari Kiran, Dr. Saisree and others
మేము సైతం అంటూ  పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇండస్ట్రీలో పేద కళాకారులను తోచిన సాయం చేసే కాదంబరి కిరణ్ తాజాగా మరో మైలురాయికి చేరారు. కాదంబరి కిరణ్ కుమార్తె డాక్టర్ సాయిశ్రీ తండ్రిపేరుమీదుగా కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించారు. దిల్ సుఖ్ నగర్, గడ్డి అన్నారం, అస్మాంగడ్ ప్రాంతంలోని వి.కే. ధాగే నగర్ మెయిన్ రోడ్‌లో కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాజ‌కీయ నాయ‌కులు,  సినీ ,టీవి నటులు , స్థానిక ప్రముఖులు, వైద్యులు, క్లినిక్ సిబ్బంది, ప్ర‌జ‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
ఈ సంద‌ర్భంగా డాక్టర్ సాయిశ్రీ మాట్లాడుతూ.. ఆరోగ్య‌క‌ర‌మైన స‌మాజాన్ని నిర్మించాల‌న్న ల‌క్ష్యంతో   కాదంబ‌రి హోమియోపతి క్లినిక్‌ను ప్రారంభించామ‌ని తెలిపారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అని తెలిపారు. నేటి తరానికి మేటి వైద్యం హోమియోపతి అని, తాను వైద్య ప్ర‌ముఖ‌ల ద‌గ్గ‌ర నేర్చుకున్న విద్య‌ని అస్మాంగడ్ ప్రాంత వాసుల‌కు అందుబాటులోకి తీసుకు రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. గ‌డ్డి అన్నారం ప్రాంత కాలనీల‌ నాయ‌కులు వ‌చ్చి విషెస్ అందించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.
 
కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభ వేడుక‌ల్లో మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు, కార్పొరేటర్ కొత్త కాపు అరుణ, నాయ‌కులు జిట్టా సురేందర్ రెడ్డి, మాదిగల విజయభాస్కర్ రెడ్డి, నవీన్ పాటియాల, VHP రుద్రరాజు రమేష్, సుభాష్ మూలా, గోవింద్ రాజు, త‌దిత‌రులు పాల్గొన్నారు..