బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (12:23 IST)

ప్రతీసారీ మంచి ఆఫర్లు రావు కదా.. వచ్చిన ఆఫర్లను యూజ్ చేసుకోవాల్సిందే: సన్నీ

సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ హాట్ గర్ల్‌గా మారిపోయింది. పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్ స్టేజ్‌కి ఎదిగిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల షారూఖ్ సినిమా 'రయీస్‌' చిత్రంలో 'లైలా ఓ లైలా' పాటలో ఆడిపాడింది. ఆ పాటతో ప్రే

సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ హాట్ గర్ల్‌గా మారిపోయింది. పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్ స్టేజ్‌కి ఎదిగిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల షారూఖ్ సినిమా 'రయీస్‌' చిత్రంలో 'లైలా ఓ లైలా' పాటలో ఆడిపాడింది. ఆ పాటతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత అదే స్థాయిలో ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా? అనే ప్రశ్నకు సన్నీ లియోన్ సమాధానమిచ్చింది. 
 
వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలనుకుంటున్నానని.. కానీ ప్రతిసారీ మంచి ఆఫర్లు రావని చెప్పుకొచ్చింది. ప్రతీసారి సక్సెస్ మంత్రాలు పనిచేయవని.. కాకపోతే... పెద్ద సినిమాల్లో అవకాశం రావాలనే కోరుకుంటా. కానీ వాస్తవానికి అన్నిసార్లు అది జరగదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటానని సన్నీ చెప్పుకొచ్చింది.