ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (17:02 IST)

చెన్నయ్ లో ఫారెస్ట్ హోర్డింగ్స్ నడుమ అభిమానులతో ఇన్‌స్పెక్టర్‌ రిషి విజయ వేడుక

Inspector Rishi team
Inspector Rishi team
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమిళ్‌ ఒరిజినల్‌ సిరిస్‌ ఇన్‌స్పెక్టర్‌ రిషి ప్రైమ్ వీడియోలో విడుదలవడంతో నిరీక్షణ ముగిసింది. ప్రేక్షకుల్లో నెలకొన్న ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు చెన్నై అంతటా మైమరపింపజేసే పోస్టర్స్‌ను ప్రైమ్ వీడియో ఏర్పాటు చేసింది. సాలెగూడు నుంచి  గిరిజనుల కొలిచే భయంకరమైన వనదేవత  వనరచ్చి అలియాస్‌ రచ్చి  బయటకు వస్తున్నట్టుగా చూపుతున్న ఈ హోర్డింగ్స్‌ హృదయాలను కదిలించి వేస్తున్నాయి.
 
 తమిళనాడులోని తెంకాడు అనే చిన్న గ్రామంలో చోటుచేసుకుంటున్న వరుస హత్యలకు సాక్ష్యంగా ఈ హోర్డింగ్స్‌లోని సాలెగూడు నిలుస్తోంది. చెన్నై నగరంలో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్స్‌ వీక్షకులలో ఆసక్తిని పెంచుతూ ఈ హారర్‌ క్రైమ్‌ డ్రామా చూసేలా ఉత్సాహం రేకెత్తిస్తోంది.  ఈ హోర్డింగ్స్‌ ఆవిష్కరించడంతో పాటు ఈ షో విజయాన్ని ప్రేక్షకులతో పంచుకునేందుకు ఈ సిరీస్‌ టీమ్‌ చెన్నై మెరీనా బీచ్‌ను ఈ మధ్య సందర్శించింది.
 
ఈ షోకు వస్తున్న పాజిటివ్‌ రెస్పెన్స్‌పై ఇందులో కీలక ప్రాత పోషించిన నవీన్‌ చంద్ర మాట్లాడుతూ, “ఇన్‌స్పెక్టర్‌ రిషి పాత్రకు వస్తున్న అపూర్వ స్పందనకు ప్రేక్షకులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ షోకు  ప్రతీ ఒక్కరి నుంచి లభిస్తున్న మద్దతు, ప్రశంసలు నాకు ఎంతో సంతోషం కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ అపూర్వ స్పందన ఇలాంటి ఆకట్టుకునే, కట్టిపడేసే కథలు మరిన్ని చేసేలా నాకు ప్రేరణగా నిలుస్తోంది. మా కష్టానికి, అభిరుచికి ప్రతిఫలం ఇన్‌స్పెక్టర్‌ రిషి, ఈ షోను అభిమానిస్తున్న వారికి మేము కృతజ్ఞులమై ఉంటాము” అన్నారు.
 
ఒంటి కన్ను ఇన్‌స్పెక్టర్‌ రిషి, ఆయనకు సాయంగా నిలిచే  నమ్మకస్తులైన ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు అయ్యన్నార్‌, చిత్ర  అతీంద్రియ శక్తులు, అసాధారణ వ్యవహారాలతో ముడిపడిన కేసులను ఎలా పరిశోధిస్తారో చూపుతుంది ఈ సిరీస్‌. వ్యక్తిగత సమస్యలను  అధిగమిస్తూ ఈ రహస్య హత్యల వెనకున్న వాస్తవాలు వెలికితీసేందుకు ఇన్‌స్పెక్టర్‌ రిషి నిర్విరామంగా శ్రమిస్తాడు.
 
ఇన్‌స్పెక్టర్‌ రిషి రచన, దర్శకత్వ  నందిని జె.ఎస్‌., దీనిని సుఖ్‌దేవ్‌ లాహిరి నిర్మించారు. ఇందులో విలక్షణ నటుడు  నవీన్‌ చంద్రతో పాటు సునయన, కన్నా రవి, మాలిని జీవరత్నం, శ్రీకృష్ణ దయాళ్‌, కుమారవేల్‌ కీలక పాత్రల్లో నటించారు. పది ఎపిసోడ్స్‌తో కూడిన ఈ సిరిస్‌ తమిళ్, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది