1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 2 మే 2022 (16:01 IST)

మా పెళ్లయి 23 ఏళ్లైంది, ఐనా విడాకులు తీసుకున్నాం అని రాస్తున్నారు, వాళ్లనేం చేయాలి?: యాంకర్ సుమ

Anchor Suma
జయమ్మ పంచాయతీ చిత్రం ప్రారంభమయినప్పటి నుంచి యాంకర్ సుమ వార్తల్లో నిలుస్తున్నారు. చిత్రానికి సంబంధించి కొంత అయితే తన భర్త రాజీవ్ కనకాలతో విడాకులు తీసుకున్నారంటూ మరో వార్త. దీనిపై గతంలో ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ కొంతమంది మాత్రం మళ్లీమళ్లీ అదే వార్తను కొత్తరూపంలో రాస్తున్నారు. ఈ రాతలపై యాంకర్ సుమ ఏమన్నారంటే...?

 
మా పెళ్లయి 23 సంవత్సరాలవుతోంది. ఇద్దరం చాలా సంతోషంగా వున్నాం. మాపై ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడల్లా మేం ఇంట్లో కలిసి ఎలా హాయిగా వున్నామన్న దానిపై ఫోటోలు షేరే చేసేదాన్ని. ఇదివరకు ఇలా చేస్తూ వచ్చాను. ఐతే కొంతమందికి ఇలా ఎన్ని నిజాలు కళ్ల ముందు కనిపిస్తున్నా... అబద్ధాల్ని ప్రచారం చేయడం అలవాటుగా పెట్టుకున్నారు. అలాంటి వారిని ఆ దేవుడే చూసుకుంటాడు.


మొదట్లో అలాంటి పర్సనల్ లైఫ్ గురించి ఇలా తప్పుడు వార్తలు రాస్తున్నారేంటా అని బాధపడేదాన్ని. సెలబ్రిటీ జీవితంలో ఇది సహజమేనని వదిలేసాను. ఇప్పుడు ఆ వార్తలు పట్టించుకునే సమయం కూడా లేదు అని చె్ప్పింది. కాగా సుమ నటించిన జయమ్మ పంచాయతీ చిత్రం మే నెల 19న విడుదల కాబోతోంది. మరి ఈ చిత్రం తర్వాత సుమకి మరిన్ని అవకాశాలు వస్తాయోమూ చూడాలి.