సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2016 (16:26 IST)

ప్రకాష్‌రాజ్‌తో నటించడం గర్వంగా ఉంది: జయసుధ

నటి జయసుధ ప్రకాష్‌రాజ్‌తో పలు చిత్రాల్లో నటించింది. ఆయనతో నటించడం చాలా సరదాగానూ, ఎడ్యుకేటెడ్‌గా ఉంటుందని.. ఒకరకంగా గర్వంగా కూడా వుంటుందని.. అందుకే ఆయనతో నటించడానికి ఆనందపడతానని.. నటి జయసుధ అన్నారు.

నటి జయసుధ ప్రకాష్‌రాజ్‌తో పలు చిత్రాల్లో నటించింది. ఆయనతో నటించడం చాలా సరదాగానూ, ఎడ్యుకేటెడ్‌గా ఉంటుందని.. ఒకరకంగా గర్వంగా కూడా వుంటుందని.. అందుకే ఆయనతో నటించడానికి ఆనందపడతానని.. నటి జయసుధ అన్నారు. 
 
'శతమానంభవతి'లో ఇద్దరూ భార్యభర్తలుగా నటించారు. దిల్‌రాజు ఇప్పటి పరిస్థితుల్లో మన సంస్క తి సంప్రదాయాలను, కుటుంబ విలువలను మరచిపోకూడదని మంచి మెసేజ్‌లతో కూడా చిత్రాలను తీస్తున్నారు.  ఆయన బ్యానర్‌లో చేసిన సినిమాలన్నీ నాకు చాలా మంచి పేరు తెచ్చాయి. బొమ్మరిల్లు సినిమా అయితే ఓ నటిగా నాకు గుర్తుండిపోతుంది. 
 
అలాగే శతమానం భవతి సినిమాకు అలాగే నిలిచిపోతుంది. అందరూ అరిస్టులు, టెక్నిషియన్స్‌ ఓ ఫ్యామిలీలా కలిసిపోయారు. శర్వానంద్‌ తన సినిమాల విషయంలో సెలక్టివ్‌గా ఉంటాడని విన్నాను. ఈ సినిమాలో తనతో నటించేటప్పుడు ఆ విషయం నాకు తెలిసింది' అని సహజనటి జయసుధ వ్యాఖ్యానించారు.