ఇంట్లో జారిపడిన కమల్ హాసన్... కుడి కాలు ఫ్రాక్చర్... వారం రోజుల విశ్రాంతి!
'లోకనాయకుడు' కమల్ హాసన్ గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఆయన తన కార్యాలయంలో మెట్లు దిగుతూ కాలుజారి పడ్డారు. దీంతో ఆయన కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఆయన కార్యాలయ సిబ్బంది కమల్‌ను హు
'లోకనాయకుడు' కమల్ హాసన్ గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఆయన తన కార్యాలయంలో మెట్లు దిగుతూ కాలుజారి పడ్డారు. దీంతో ఆయన కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఆయన కార్యాలయ సిబ్బంది కమల్‌ను హుటాహుటిన నగరంలోని చెన్నై ఆసుపత్రికి తరలించారు.
ఆయన కుడి కాలికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కమల్‌కు వైద్య పరీక్షలు చేసిన అపొలో డాక్టర్స్ ఆయన కాలుకి అయిన గాయాల గురించి ఇంకా పూర్తి వివరాలను తెలియజేయలేదు.
అయితే కమల్‌కు ప్రమాదంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తమిళ చిత్ర సీమలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చలన చిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కోలీవుడ్ ప్రముఖ హీరో కమల్ హాసన్ హాస్పిటల్‌లో చేరడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కమల్ ఇటీవలే శభాష్ నాయుడు షూటింగ్ షెడ్యూల్ ముగించుకొని చెన్నై చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.