సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (18:24 IST)

రాకింగ్ రాకేష్ చిత్రానికి కెసిఆర్ టైటిల్ ఖరారు

Rakesh-mallareddy and others
Rakesh-mallareddy and others
గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై ‘జబర్‌దస్త్’ షో తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్  హీరోగా పరిచయం అవుతున్నారు. గరుడవేగ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు డీవోపీ గా పని చేసిన అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
 
తెలంగాణ ప్రాంతం బంజారా (తాండ) నేపధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ''కెసిఆర్'' (కేశవ్ చంద్ర రమావత్) అనే పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేశారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతులుమీదగా మల్లారెడ్డి యూనివర్సిటీలో 50 అడుగుల కటౌట్ తో 50,000 మంది స్టూడెంట్స్ సమక్షంలో టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.  ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ తో పాటు చిత్ర బృందం హాజరయ్యారు.
 
ఈ చిత్రంలో అనన్య హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటులు తనికెళ్ళ భరణి, కృష్ణభగవాన్, ధనరాజ్ తో పాటు తాగుబోతు రమేష్, రచ్చరవి, జోర్ధార్ సుజాత, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 తెలంగాణ మ్యాస్ట్రో చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు గరుడవేగ అంజి డీవోపీగా పని చేస్తున్నారు. బలగం మధు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి బత్తుల మహేష్ ఆర్ట్ డైరెక్టర్ .
 
నటీనటులు: రాకింగ్ రాకేష్, అనన్య , తాగుబోతు రమేష్, రచ్చరవి, జోర్ధార్ సుజాత, అంజి, కనకవ్వ, రైజింగ్ రాజు, సన్నీ, ప్రవీణ్, లోహిత్ తదితరులు.