గురువారం, 31 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2020 (12:43 IST)

'శ్వేతవర్ణం' దుస్తుల్లో మెరిసిపోతున్న మహేష్ హీరోయిన్!!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంలో హీరో సరసన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించింది. తెలుగులో ఈమెకు ఇదే తొలి చిత్రం. ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడు తన మకాంను బాలీవుడ్‌కు మార్చేసింది. 
 
అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా 'లస్ట్ స్టోరీస్'లో బోల్డ్ సీన్స్‌లో నటించి షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ హాట్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఆ ఇమేజ్‌కు తగినట్టుగానే ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.
 
విమానాశ్రయంలోనూ, జిమ్‌కు వెళ్లేటప్పుడు హాట్ డ్రెస్సులు ధరించి కెమెరాలకు చిక్కుతోంది. శ్వేతవర్ణం దుస్తుల్లో దగదగ మెరిసిపోతోంది. తాజాగా కియార వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో మెరిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కియారా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా, కియారా, అక్షయ్ కుమార్ నటించిన 'లక్ష్మీ బాంబ్' చిత్రం దీపావళికి ప్రేక్షకు ముందుకురానుంది.