ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2023 (18:39 IST)

పూణేలోని 1761 నాటి రామ-సీత ఆలయాన్ని సందర్శించిన కృతి సనన్

Kriti Sanan visiting the 1761 Rama-Sita temple
Kriti Sanan visiting the 1761 Rama-Sita temple
సీతా నవమి శుభ సందర్భంగా, రామ్ సియా రామ్ ఆడియో టీజర్‌తో పాటు జానకి పోస్టర్‌ను విడుదల చేసిన తర్వాత, ఆదిపురుష్ లోని సీత పాత్రధారి కృతి సనన్ ప్రభువు ఆశీర్వాదం కోసం పూణేలోని తులసిబాగ్‌లోని అత్యంత పూజ్యమైన రామమందిరానికి ఈరోజు చేరుకున్నారు. శ్రీరాముడు, మా సీత హనుమంతుని విగ్రహాలకు పూజ చేశారు. 
 
 ఆమె సందర్శన సమయంలో, కృతి సనన్ దేవతలకు పూజలు చేయడమే కాకుండా, ఆలయంలోని కొంత సేపు  ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించింది. పూణేలోని అత్యంత పూజనీయమైన ఈ శ్రీరామ మందిరాన్ని పీష్వా పాలనలో 1761లో నిర్మించారు.
భూషణ్ కుమార్ నిర్మించిన ఓం రౌత్ ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.