శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శనివారం, 21 జనవరి 2017 (15:57 IST)

రాఘవ లారెన్స్ 'శివ‌లింగ' టీజ‌ర్ విడుద‌ల‌

కొరియోగ్రాఫర్‌, డైరెక్ట‌ర్, హీరోగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో భారీ బడ్జెట్‌తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై 'శివలింగ'ను తెరకెక్కిస్తున్న చిత్రం 'శి

కొరియోగ్రాఫర్‌, డైరెక్ట‌ర్, హీరోగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో భారీ బడ్జెట్‌తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై 'శివలింగ'ను తెరకెక్కిస్తున్న చిత్రం 'శివ‌లింగ'. రితిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన క‌న్న‌డ సూప‌ర్‌హిట్ మూవీ శివ‌లింగ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. జ‌న‌వ‌రి 23న ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. 'కథే హీరోగా కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం 'శివలింగ '. పి.వాసు చంద్రముఖి, లారెన్స్ కాంచన, గంగ చిత్రాలను మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్‌టైనర్‌గా శివలింగ తెరకెక్కుతోంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 23న విడుద‌ల చేస్తున్నాం. అలాగే సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. హార్రర్ కాన్సెప్ట్‌లపరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్‌లో ఉండే చిత్రమని అన్నారు.