1116 శివాలయాల్లో గౌతమీపుత్రుడి కోసం మహారుద్రాభిషేకం...
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్‌ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై రూపొందుతోన్న ప్రెస్టిజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదలవుతుంద
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్‌ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై రూపొందుతోన్న ప్రెస్టిజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదలవుతుంది. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నందమూరి అభిమానులు సినిమా విజయవంతం కావాలని ఆశిస్తూ నవంబర్ 28 కార్తీక సోమవారం రోజున దేశవ్యాప్తంగా ఉన్న 1116 శివాలయాల్లో ఏకకాలంలో మహారుద్రాభిషేకంను నిర్వహిస్తున్నారు.
ఎన్.బి.కె.హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం జరగనుంది. ఈ రుద్రాభిషేకంలో ఏదేని ఓ ఆలయంలో జరిగే రుద్రాభిషేకంలో నందమూరి బాలకృష్ణ పాల్గొంటున్నారు. దేశంలో ఏ హీరోకు నిర్వహించని విధంగా నందమూరి బాలకృష్ణ కోసం ఆయన నటించిన 100వ చిత్రంగౌతమిపుత్ర శాతకర్ణి కోసం ఆయన అభిమానులు వేడుకలను నిర్వహిస్తున్నారు.