గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (11:14 IST)

మహేష్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ''భరత్ అనే నేను'' ఫస్ట్ లుక్ ఇదే!

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా నటించిన స్పైడర్‌ సినిమా సక్సెస్‌ఫుల్‌గా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్న తరుణంలో మహేష్ బాబు.. తన అభిమానులకు స్పెషల్

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా నటించిన స్పైడర్‌ సినిమా సక్సెస్‌ఫుల్‌గా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్న తరుణంలో మహేష్ బాబు.. తన అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ప్రిన్స్ కథానాయకుడిగా నటిస్తున్న భరత్‌ అనే నేను ఫస్ట్‌లుక్‌ విడుదలైంది.
 
కొరటాల శివ దర్శకత్వం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫస్ట్‌లుక్‌లో మహేశ్‌ ఎప్పటిలాగే హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. పక్కన ఇద్దరు గన్‌మెన్‌లతో నడిచొస్తున్న స్టిల్‌ ఆకట్టుకుంటోంది. ఆయన వెనక బ్రహ్మాజీ కూడా ఉన్నారు. ఇందులో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి కైరా అద్వానీ నటిస్తోంది. యూపీలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2018 సంక్రాతి రానుంది.