శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 మే 2017 (18:16 IST)

ఐదేళ్ల క్రితం నిర్భయ అనుభవించిన బాధను ఆ నలుగురు అనుభవిస్తారు: మంచు లక్ష్మి

నిర్భయ కేసులో దోషులకు సుప్రీం కోర్టు మరణశిక్ష విధించడంపై సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తనయ, నటీమణి, యాంకర్ మంచు లక్ష్మి స్పందించారు. నిర్భయ గత ఐదేళ్ల క్రితం ఎలాంటి బాధను అనుభవించిందో.. ఉరిశిక్షకు గురైన ఆ నలుగురు దోషులు కూడా అంతే బాధను అనుభవించక తప్పద

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు సుప్రీం కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. నిర్భయ కేసులో దోషులకు సుప్రీం కోర్టు మరణశిక్ష విధించడంపై సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తనయ, నటీమణి, యాంకర్ మంచు లక్ష్మి స్పందించారు. నిర్భయ గత ఐదేళ్ల క్రితం ఎలాంటి బాధను అనుభవించిందో.. ఉరిశిక్షకు గురైన ఆ నలుగురు దోషులు కూడా అంతే బాధను అనుభవించక తప్పదన్నారు. 
 
ఇకపోతే.. మంచులక్ష్మి రాజకీయాల్లోకి రానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మంచు లక్ష్మిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం మహిళా ఎమ్మెల్యేలు మంచు లక్ష్మితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. వైకాపా తరపున ఫైర్ బ్రాండ్ రోజాకు.. కౌంటర్ ఇచ్చేందుకు మంచు లక్ష్మి అయితే కరెక్ట్ అని టీడీపీ మహిళా నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా మంచు లక్ష్మిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు టీడీపీ వర్గాల్లో టాక్ వస్తోంది.