మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (16:19 IST)

తిట్లను భరించేవాడే బలవంతుడు : పవన్ మేనల్లుడి ట్వీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై నిన్నామొన్నటివరకు ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ విమర్శలు గుప్పిస్తూ వచ్చాడు. ఇపుడు నటి శ్రీరెడ్డి కూడా ఆ జాబితాలో చేరిపోయింది. క్యాస్టింగ్ కౌచ్‌ విషయంలో తనకు జరిగిన అన్యాయంపై

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై నిన్నామొన్నటివరకు ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ విమర్శలు గుప్పిస్తూ వచ్చాడు. ఇపుడు నటి శ్రీరెడ్డి కూడా ఆ జాబితాలో చేరిపోయింది. క్యాస్టింగ్ కౌచ్‌ విషయంలో తనకు జరిగిన అన్యాయంపై బహిరంగంగా మాట్లాడటం కంటే పోలీసులను సంప్రదిస్తే తగిన న్యాయం జరుగుతుందని శ్రీరెడ్డికి పవన్ సలహా ఇచ్చాడు. దీనిపై శ్రీరెడ్డి ఘాటైన విమర్శలతో కౌంటర్ ఇచ్చింది.
 
ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలు అంతటా హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ ఉదంతంపై ఇప్పటికే వరుణ్ తేజ్, నితిన్ లాంటి స్టార్స్ స్పందించగా.. తాజాగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా తనదైన స్టైల్‌లో స్పందించాడు. ట్విట్టర్ వేదికగా పవన్ మాట్లాడుతున్న వీడియోను పోస్ట్ చేసి విమర్శకులందరికీ సమాధానం చెప్పాడు.
 
ఈ వీడియోలో పవన్ తన కార్యకర్తలతో మాట్లాడుతూ 'కష్టాలుంటాయ్.. పాలిటిక్స్‌లో.. నన్ను తిడుతుంటే ఒక్కోసారి మీకు ఇబ్బంది కలగొచ్చు. నేను భరిస్తాను.. బలవంతుడే భరిస్తాడు. మనం బలమైన వ్యక్తులం.. భరిద్దాం. భరించిన వాడే సాధించగలడు. అంతేగానీ మాట అనేసారు కదా అని పారిపోతే ఎట్లా.. అలా అయితే నిన్ను తిట్టేవారు విజయం సాధించినట్లు. అలా పారిపోవద్దు దేన్నుంచి. అలా అనిచెప్పి ఎదురుదాడి చెయ్యొద్దు. భరించండి.. చూడండి.. ఎంతసేపంటారో చూడండి. మార్పు చాలా సైలెంట్‌గా అదే వచ్చేస్తుంది. భరించడం వల్ల వచ్చేశక్తి చాలా బలమైన శక్తి మన లోపలినుంచి’’ అన్నారు. సాయిధరమ్ తేజ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవ్వడమేగాక పలు చర్చలకు తావిస్తోంది.