సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 16 ఫిబ్రవరి 2017 (20:11 IST)

రెండు రోజులు ఓపిక పట్టమంటున్న అర్జున్‌

రెండు రోజులు ఆగండి.. కావలసినంత కిక్‌ ఇస్తానంటున్నాడు అల్లు అర్జున్‌. ఆయన నటిస్తున్న 'దువ్వాడ జగన్నాధం' చిత్ర పబ్లిసిటీలో భాగంగా రోజుకొక పోస్టర్‌ బయటకు వస్తుంది. శివలింగం.. రుద్రాక్షలు వరకు కన్పించే ఈ స్టిల్స్‌తోపాటు అంతకుముందు చేయి మాత్రమే కన్పించేలా

రెండు రోజులు ఆగండి.. కావలసినంత కిక్‌ ఇస్తానంటున్నాడు అల్లు అర్జున్‌. ఆయన నటిస్తున్న 'దువ్వాడ జగన్నాధం' చిత్ర పబ్లిసిటీలో భాగంగా రోజుకొక పోస్టర్‌ బయటకు వస్తుంది. శివలింగం.. రుద్రాక్షలు వరకు కన్పించే ఈ స్టిల్స్‌తోపాటు అంతకుముందు చేయి మాత్రమే కన్పించేలా విడుదల చేసిన పోస్టర్‌ అభిమానుల్లో ఆసక్తి కల్గించాయి. 
 
అందుకే మరో రెండు రోజులు ఆగమంటున్నాడు. 'గబ్బర్‌ సింగ్‌' దర్శకుడు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రాజు నిర్మిస్తున్న చిత్రమిది. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ని ఈ నెల 18న రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అర్జున్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.