కింగ్ నాగార్జున `వైల్డ్ డాగ్` ఫస్ట్ లుక్ విడుదల
కింగ్ నాగార్జున టైటిల్ పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నెం.6గా అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `వైల్డ్ డాగ్`. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరిలో ఆసక్తిని రేపుతోంది.
డిఫరెంట్‌గా ఉన్న నాగార్జున్ లుక్ రీసెంట్‌గా జరిగిన దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంది. ఈ సినిమాలో నాగార్జున ఎన్.ఐ.ఎ ఆఫీసర్‌గా నటిస్తున్నారని ఫస్ట్ లుక్‌లోని న్యూస్ పేపర్ రిపోర్ట్ ఆధారంగా తెలుస్తుంది.
జాతీయ పత్రికలో రాసిన వార్తల సారాంశం ఆధారంగా అసలు సినిమా ప్రధాన కథాంశం ఏంటో అర్థమవుతుంది. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ వర్మను పోలీస్ శాఖలో అందరూ వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు.
నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందిన వైల్డ్ డాగ్ విజయ్ వర్మ పాత్రలో అక్కినేని నాగార్జున నటిస్తున్నారు.
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కుమార్ డైలాగ్స్ రాశారు. షానియల్ డియో సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రయోగాలు చేయడంలో ముందుండే నాగ్ ఈ సినిమాతో మరో ప్రయోగం చేస్తున్నారు. మరి... నాగ్ ప్రయోగం ఫలిస్తుందా..? లేదా..? అనేది చూడాలి.