మంగళవారం, 14 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (11:59 IST)

"నేను లోకల్" అంటూ రాబోతున్న హీరో నాని

హీరో నాని. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టుకున్న హీరో. ఈ హీరో తాజాగా 'నేను లోకల్‌' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వచ్చేనెలలో ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతుండగానే,

హీరో నాని. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టుకున్న హీరో. ఈ హీరో తాజాగా 'నేను లోకల్‌' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వచ్చేనెలలో ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతుండగానే, మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 
 
డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి, శివకుమార్‌ దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
ఈ సినిమాలో కథానాయికగా నివేదా థామస్‌ను ఎంపిక చేసుకున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'జెంటిల్‌ మన్‌' సక్సెస్‌ను సాధించడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి. జనవరిలో ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలుకానుంది.