శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2025 (17:15 IST)

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

nidhi agerwal
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై సినీ నటి నిధి అగర్వాల్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం తాను పవన్ కళ్యాణ్‌తో "హరి హర వీరమల్లు", ప్రభాస్‌తో "రాజాసాబ్" చిత్రాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. వీరిద్దరూ తనను బాగా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పారు. ఈ రెండు చిత్రాలు తనకు మంచి పేరు తెచ్చిపెడతాయని ఆమె గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే, ఈ ఇద్దరు హీరోల గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
పవన్, ప్రభాస్ ఇద్దరూ తనను ఎంతో ప్రోత్సహించారని ఆమె చెప్పారు. పవన్ సెట్స్‌లో ఉన్నపుడు ఏకాగ్రతతో ఉంటారని, యాక్షన్ చెప్పగానే పూర్తిగా నటనలో లీనమైపోతారన్నారు. పైగా, తన చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరని, తన సన్నివేశంపై మాత్రమే దృష్టిసారిస్తారని తెలిపారు. పవన్ నుంచి తాను ఈ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు. 
 
ప్రభాస్ మాత్రం సెట్స్‌లో ఎపుడూ ఫన్నీగా ఉంటారని చెప్పుకొచ్చింది. కాగా, ఈ రెండు చిత్రాలకు కమిట్ అయిన తర్వాత నిధి అగర్వాల్ ఇప్పటివరకు ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. ఆయా చిత్రాలకు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆమె మరో చిత్రానికి పని చేయలేని పరిస్థితి నెలకొంది. ఇది ఆమె సినీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇదే అంశాన్ని ఆమె పలు సందర్భాల్లో ప్రస్తావించింది కూడా. ఇదిలావుంటే, ఈ రెండు మూవీలు త్వరలోనే విడుదలకు సిద్ధమయ్యాయి.