శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 10 అక్టోబరు 2018 (16:33 IST)

దసరా కానుకగా పందెం కోడి 2 రిలీజ్.. కీర్తి సురేశ్ సందడి...

కీర్తి సురేశ్ ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నారు. మహానటి చిత్రంలో అందరి మన్ననలను దోచుకున్న కీర్తి సురేశ్‌కి తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. విశాల్ హీరోగా కీర్తి కథానాయికగా నటించిన పందెం కోడి 2 దసరా పండుగ (అక్టోబర్ 18) రోజున తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.
  
 
విజయ్‌కి జోడీగా సర్కార్ చిత్రంలో కీర్తి నటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను దసరా పండుగ అంటే అక్టోబర్ 18వ తేదీన సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అలానే ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6వ తేదిన విడుదల చేయనున్నారు.

విజయ్, విశాల్ ఇద్దరూ మాస్ హీరోలు కనుక నేను నటించిన ఈ రెండు సినిమాలు తన కెరియర్‌కి బాగా కలిసొస్తాయని కీర్తి సురేశ్ భావిస్తున్నారు. మరి ఈ భామ అనుకుంటున్నది జరుగుతుందో లేదో చూద్దాం.