బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (20:33 IST)

మెగాస్టార్ అనే చెట్టుకుని పవన్, చెర్రీ, బన్నీ, వరుణ్, సాయి అనే కొమ్మలు..... : పరుచూరి గోపాలకృష్ణ

మెగాస్టార్ అనే చెట్టుకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, నీహారిక వంటి శాఖలు ఉన్నాయని ప్రముఖ సినీ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. అంతేనా దేవుడి కోసం భక

మెగాస్టార్ అనే చెట్టుకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, నీహారిక వంటి శాఖలు ఉన్నాయని ప్రముఖ సినీ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. అంతేనా దేవుడి కోసం భక్తులు ఎదురు చూసినట్టుగా మెగాస్టార్ చిరంజీవి చిత్రం కోసం సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారన్నారు. 
 
గంటూరులోని హాయ్‌ల్యాండ్ వేదికగా చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రం ప్రీరిలీజ్ వేడుక శనివారం రాత్రి జరిగింది. ఇందులో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ... 1978లో తాము, చిరంజీవిగారు ఒకేసారి సినీ రంగప్రవేశం చేశామనీ, ఖైదీ సినిమాకు తాము మాటలు రాశామని, ఆ సినిమా చిరుతోపాటు తమకు కూడా బ్రేక్ ఇచ్చిందని అన్నారు. చిరంజీవి సినిమాల్లో మూడో వంతు సినిమాలకు మాటలు తామే రాశామని అన్నారు. తమలాగే చిరంజీవి కూడా స్వశక్తితో పైకి ఎదిగాడని ఆయన అన్నారు. 
 
ఈ సందర్భంగా ఇంద్ర సినిమాలో డైలాగ్ చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, దేవుడికోసం భక్తుడు ఎదురు చూసినట్టు ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారని అన్నారు. మెగాస్టార్ ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆయన ఆకాశమంత ఎత్తు ఎదిగాడని అన్నారు. మెగాస్టార్ అనే చెట్టుకి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, నిహారిక అనే కొమ్మలు వచ్చాయని అన్నారు. ఈ కొమ్మలన్నీ తమ వారసత్వాన్ని కాపాడుతున్నాయని ఆయన తెలిపారు. సంక్రాంతి పండగ అప్పుడే వచ్చేసిందా? అన్నట్టు ఇక్కడి కోలాహలం ఉందని ఆయన తెలిపారు. 

ఈ సందర్భంగా పరుచూరి బ్రదర్స్ ఇంద్ర సినిమాలోని డైలాగ్‌ను వల్లెవేశారు. 'ప్రజాసేవ చేయడానికి వెళ్తున్నాను, కళా సేవచేయడానికి మళ్లీ వస్తున్నాను' అని ఓ సినిమాలో చిరంజీవి చెప్పినట్లగా ఆయన నిజ జీవితం కూడా అలాగే గడిచిందన్నారు. చిరంజీవిది ఇప్పటికీ అదే రక్తం, అదే పౌరుషమని పరుచూరి వెంకటేశ్వర రావు కొనియాడారు. 
 
చిరంజీవిని ఉద్దేశించి కొత్త కవిత చెప్పారు. చీకటి కోసం చంద్రుడు ఎదురు చూసినట్టు వెలుతురు కోసం సూర్యుడు ఎదురు చూసినట్టు వర్షం కోసం రైతు ఎదురు చూసినట్టు తల్లి కోసం బిడ్డ ఎదురు చూసినట్టు దేవుడి కోసం భక్తులు ఎదురు చూసినట్టు చిరంజీవి కోసం అభిమానులు ఎదురుచూశారని, వారి ఎదురు చూపులు ఖైదీనెం.150తో నిజమయ్యాయని వెంకటేశ్వర్‌రావు అన్నారు.