పవన్‌కళ్యాణ్, రానా ఇద్దరూ ఇగోయిస్టులే!
పవన్‌కళ్యాణ్, రానా ఇద్దరు ఇగోల కథతో తెలుగులో ఓ సినిమా వస్తోంది. ఇది మలయాళం 'అయ్యప్పనుమ్ కోషియుమ్సకు రీమేక్. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ సినిమా మాతృకలోని అంశాలను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి తీస్తున్నారు. ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు వున్నారు. సాగర్‌చంద్ర డైరెక్షన్ స్కిల్స్ మీద నమ్మకంతోనే ఆయనను డైరెక్టర్‌గా తీసుకున్నాం.
అయితే పవన్ కల్యాణ్ గారు, రానా గారు నటిస్తుండటంతో, ప్రాజెక్ట్ పెద్దదైపోయింది. దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్‌లోకి వచ్చారు. ఆయన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ సినిమాకి బలమవుతాయి అని నిర్మాత తెలియజేస్తున్నారు.
ఇందులో హీరో విలన్ అని కాకుండా బేలన్స్ చేస్తూ తీసిన సినిమా. ఇప్పటికీ 40శాతం షూటింగ్ పూర్తయింది. మలయాళంలో లేని ఎపిసోడ్ ఇందులో వుంటుంది. పవన్ ఇమేజ్‌కు తగినట్లుగా ఫ్లాష్‌బేక్ ఎపిసోడ్ కొత్తగా పెడుతున్నారు. రానా జోడీగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తోంది. పవన్‌కు జోడీగా ఇంకా ఎవరినీ అనుకోలేదు. టైటిల్ కూడా పెట్టలేదు. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలియజేస్తున్నారు.