మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (22:13 IST)

పవన్ చెప్పులను చేతబట్టుకున్న అన్నా లెజినోవా.. వదినమ్మ అంటూ పీకే ఫ్యాన్స్ కితాబు

Pawan's sandals
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో వుంది. భర్త పవన్ కల్యాణ్ కోసం ఎన్నికల సమయంలో వెనుక నుంచి ఎంతో శ్రమపడిన అన్నా.. తాజాగా తన భర్త పక్కనే వుంటూ అంతా తానై ముందుకు నడుపుతోంది. అలాగే అకీరా నందన్‌ను కూడా తండ్రికి దగ్గర చేస్తోంది. దీంతో ఇప్పటికే పీకే ఫ్యాన్స్ అన్నాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
తాజాగా ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా, అకిరా నందన్‌లు చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి ఇంట్లో పవన్ కళ్యాణ్ కోసం స్వాగత ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఇక రామ్ చరణ్, వరుణ్ తేజ్, సురేఖ, అంజనమ్మ ఇలా అందరూ పవన్ కళ్యాణ్‌ను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. 
 
అంజనమ్మ అయితే దగ్గరుండి మరీ దిష్టి తీయించారు. పవన్ కళ్యాణ్ తన అమ్మకి, వదినమ్మకి పాదాభివందనం చేసే సమయంలో చెప్పులు వదిలేశాడు. ఆ చెప్పుల్ని అన్నా లెజినోవా చేతుల్తో పట్టుకుని అలా వెనకలా నిల్చుండిపోయారు. 
Pawan's sandals
Pawan's sandals
 
ఇక కేక్ కట్ చేసే సందర్భంలో సాయి ధరమ్ తేజ్ విజిల్స్‌తో మోత మోగించాడు. ఈ వీడియోని చూస్తే మెగా ఫ్యాన్స్ అటు పీకే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. వదినమ్మ అన్నా గ్రేట్ అంటూ కితాబిస్తున్నారు.