ఆలోపే ప్రపంచం అంతమైపోతే నేను చాలా సంతోషిస్తా: శ్రీముఖి
మనం కలిసి జీవించేందుకు వుండేందుకు కారణంగా డబ్బే అనిపిస్తోందని యాంకర్ శ్రీముఖి తెలిపింది. మానవత్వాన్ని జనాలు మరిచిపోయారా అని అడిగింది. జనాల్లో మానవత్వం మొత్తం నశించేలోపు.. ఈ ప్రపంచం అంతమైపోతే తాను చాలా సంతోషిస్తానని శ్రీముఖి ట్వీట్ చేసింది.
మానవత్వాన్ని జనాలు మర్చిపోయారా అనే ప్రశ్న.. గతంలో తనకు ఎదురైంది. కానీ వారి అభిప్రాయంతో తాను ఏకీభవించలేదు. కానీ ప్రస్తుతం తనకు ఆ అనుభవం ఎదురైంది. మనం కలిసి వుండేందుకు, కలసి జీవించేందుకు డబ్బే కారణం అనిపిస్తోందని.. శ్రీముఖి వ్యాఖ్యానించింది. జులాయి సినిమాతో అల్లు అర్జున్ చెల్లిగా నటించిన శ్రీముఖి.. ఆ తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలతో యాంకర్ కావడం మొదలెట్టింది.
ఆ తర్వాత నటీమణిగా ఎదిగింది. అందాల ఆరబోతలో అనసూయ, రష్మీకి పోటీగా నిలుస్తున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడూ క్లీవేజ్ షోలతో కుర్రకారును ఉర్రూతలూగించింది. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. బాగానే ట్రెండ్ అవుతోంది. అలాంటి యాంకర్ ప్రస్తుతం మానవత్వం గురించి మాట్లాడుతూ.. నిరుత్సాహం వ్యక్తం చేస్తోంది. ఇందుకు కారణం ఏమిటో తెలియట్లేదు మరి.