ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జులై 2018 (15:10 IST)

గదిలో రుద్రాక్షమాల పెట్టి "ఆ" పూజలు చేయడానికి ఫూల్‌ను కాదు : శ్రీరెడ్డికి లారెన్స్ వార్నింగ్

క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఒక్కసారిగా మంచి పబ్లిసిటీ కొట్టేసిన నటి శ్రీరెడ్డికి సినీ దర్శకుడు, హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అంతేనా... మంచి నటివని నిరూపించుకునేందుకు విలేకరుల

క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఒక్కసారిగా మంచి పబ్లిసిటీ కొట్టేసిన నటి శ్రీరెడ్డికి సినీ దర్శకుడు, హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అంతేనా... మంచి నటివని నిరూపించుకునేందుకు విలేకరుల ముందు ఓ పరీక్ష పెడతానని అందులో పాస్ అయితే తాను దర్శకత్వం వహించే తదుపరి చిత్రంలో సినీ అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు.
 
'రెబెల్' మూవీ సమయంలో తనకు ఛాన్స్ ఇస్తానని చెప్పి తనను వాడేసుకున్నాడంటూ రాఘవ లారెన్స్‌పై శ్రీరెడ్డి ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. వీటిపై లారెన్స్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందించాడు. అందులోని సారాంశాన్ని పరిశీలిద్ధాం. 
 
'హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ నేను ట్రస్ట్‌ని ప్రారంభించి 13 యేళ్లు కావస్తోంది. ప్రతి ఒక్కరి సహాయ సహకారంతో ఇది విజయవంతంగా నడుస్తోంది. మీ ఆదరాభిమానాలకు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. మీకందరికి ఇపుడు ఓ విషయం చెప్పదలచుకున్నా. అదేంటంటే... శ్రీరెడ్డి విషయాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. నేను 'రెబల్' మూవీ చేసి ఏడేళ్ళు పూర్తయింది. ఈ ఏడేళ్ళ కాలంలో శ్రీరెడ్డి ఈ ఇష్యూను ఎందుకు బయటకు చెప్పలేదు? 
 
ఓకే.. ఆ సంగతి పక్కనపెడుదాం. ఆమె నా హోటల్ రూమ్‌కి వచ్చానని... అప్పుడు నేను ఆమెను మిస్ యూజ్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది. పైగా, నా గదిలో దేవుడి ఫోటో, రుద్రాక్ష మాల కూడా చూశానని చెప్పింది. హోటల్స్‌లో రుద్రాక్ష మాల పెట్టి ఆ తరహా పూజలు చేయడానికి నేనేమీ ఫూల్స్ కాను. ఇపుడు శ్రీరెడ్డికి డైరెక్ట్‌గా చెబుతున్నా.. నేనే తప్పూ చేయలేదు ఆ విషయం నాకు తెలుసు.. ఆ భగవంతుడికి తెలుసు. నువ్వింత చేశాక కూడా నాకు నీపై కోపం రావట్లేదు. నీ ఇంటర్వ్యూస్‌ అన్నీ చూశాను.. నీపై జాలి కలుగుతోంది నాకు.
 
హల్లో శ్రీరెడ్డిగారూ.. అసలు నీ సమస్య ఏంటి? సినీ ఛాన్సుల పేరుతో నిన్ను మోసం చేశారనే కదా. నువ్వొక మంచి నటివని చెప్తున్నావు కదా.. మేమొక విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశానికి నువ్వు కూడా హాజరుకండి. మీడియా ముందు నీకో క్యారెక్టర్, సీన్ ఇస్తా నటించి చూపించు. అలాగే కొన్ని డ్యాన్స్ స్టెప్స్ చూపిస్తా అవి చేసి చూపించు. అలాగనీ, కష్టమైన స్టెప్స్ వేయమని చెప్పను. చాలా సింపుల్‌గా ఉండే స్టెప్స్ మాత్రమే. అలాగే కొన్ని సంభాషణలు ఇస్తా.. వాటిని తప్పులేకుండా ఉచ్ఛిరించి చూపించు. 
 
ఎందుకంటే అవి కూడా నటీనటులకు ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్. నువ్వు నిజంగా టాలెంటెడ్ అయితే నా ఎదుట, ప్రెస్ ఎదుట అవి చేసి చూపించు. నిజంగా నువ్వు బెస్ట్ యాక్టర్‌వి అని నేను ఫీల్ అయితే ఓ దర్శకుడిగా ప్రెస్ ఎదుట నా తదుపరి చిత్రంలో నీకో మంచి పాత్ర ఇచ్చేందుకు సైన్ చేసి.. కొంత అడ్వాన్స్ సొమ్మును కూడా చెల్లిస్తాను. 
 
ఈ విషయంలో నేనేమీ తప్పు చేయలేదు కాబట్టి నిన్ను డైరెక్ట్‌గా ఫేస్ చేసేందుకు నేను భయపడటం లేదు. నీవు నా సినిమాలో నటించినట్లైతే నీకు చాలా ఛాన్సులు వస్తాయి. నీవు ప్రతి ఒక్కరి ముందు నటించాలంటే ఫీల్ అయితే నువ్వు నా మేనేజర్‌ని కాంటాక్ట్ అవ్వు. నీ లాయర్‌ని, నీ మంచికోరేవారిని వెంట తీసుకొచ్చుకుని నీ నటన ప్రతిభను చూపించు. నేను తప్పకుండా సాయం చేస్తా. నేను భయపడిన కారణంగా ఈ రిప్లై ఇవ్వట్లేదు. నేను మహిళలకు చాలా గౌరవం ఇస్తాను. అందుకే నా తల్లికి గుడికట్టి అది మహిళలకు అంకితం చేశాను. మంచి మాట్లాడుకుందాం.. మంచి పనులు చేద్దాం. నీకు మంచి జీవితం లభించాలని నేను ప్రార్థిస్తాను' అంటూ రాఘవ లారెన్స్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.