శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (10:21 IST)

రాహుల్, పునర్నవి లవ్ స్టోరీ వచ్చేస్తోంది..

బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి సినిమాలో కలిసి నటించనున్నారు. బిగ్ బాస్ మూడో సీజన్‌ జరుగుతున్నంత సేపూ.. అందులో కంటిస్టెంట్లైన రాహుల్, పునర్నవిలు ప్రేమించుకుంటున్నారని జోరుగా ప్రచారం సాగింది. 
 
హౌజ్ నుంచి బయటికి వచ్చినప్పటి వీరి ప్రేమపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి నటించనున్నారనే వార్త ఇద్దరి ఫ్యాన్సుకు ట్రీట్ ఇచ్చేలా చేసింది. త్వరలో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి కలిసి.. లవ్ స్టోరీ సినిమాలో నటించబోతున్నట్లు తెలిసింది. 
 
వీళ్లిద్దరిపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉన్న ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు ఓ నిర్మాత తెలివైన ప్లాన్ వేశారు. ఓ మంచి లవ్ స్టోరీతో సినిమా తియ్యాలనీ, అందులో వీళ్లనే హీరో, హీరోయిన్లుగా పెట్టుకోవాలని డిసైడయ్యారు. దీనికి వాళ్లిద్దరూ ఒప్పుకున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమాలో ఇద్దరూ కలిసి నటించబోతున్నారనే అంశంపై ఇంకా అధికారిక క్లారిటీ ఇవ్వాల్సి వుంది.