గురువారం, 31 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జులై 2024 (15:42 IST)

రాజ్‌ తరుణ్‌‌పై కేసు నమోదైంది.. ప్రెగ్నెన్సీ వ‌స్తే అబార్షన్ చేయించాడు..

Raj Tarun's Ex-Lover Lavanya
సినీ నటుడు రాజ్‌ తరుణ్‌‌పై కేసు నమోదైంది. లావణ్య, మాల్వీ ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు కూడా చేసుకుంటుండ‌డంతో ఈ కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతూ తాజాగా ఓ కొత్త ట‌ర్న్ తీసుకుంది. బుధ‌వారం లావణ్య మ‌రోసారి రాజ్ తరుణ్, మాల్వీల‌పై ఫిర్యాదు చేసింది. 
 
అంతే కాకుండా పోలీసులకు కొన్ని ముఖ్య ఆధారాలు ఇచ్చినట్లు స‌మాచారం. వాటిలో రాజ్ త‌రుణ్‌తు ఉన్న 170 ఫొటోలు, ఇంకా ప‌లు టెక్నిక‌ల్ అండ్ మెడిక‌ల్ ఎవిడెన్స్‌లు అందజేసింది. దీంతో నార్సింగ్ పోలీసులు హీరో రాజ్ తరుణ్ పై ఐపీసీ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
రాజ్‌తరుణ్‌తో పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని, ప‌దేండ్లుగా కాపురం చేశామని.. కొన్నాళ్ల క్రితం ప్రెగ్నెన్సీ వ‌స్తే అబార్షన్ చేయించాడంటూ లావణ్య ఆరోపించింది. 
 
కొంత‌కాలం క్రితం కానీ మాల్వీ మ‌ల్హోత్రా వచ్చాక రాజ్‌తరుణ్‌ తనను దూరం పెట్టాడని.. మాల్వీ కోసం రాజ్‌తరుణ్‌ ముంబైలో ఎక్కువ‌గా ఉంటున్నాడ‌ని చెప్పింది. అందుకు సంబంధించి మెడికల్ డాక్యుమెంట్స్‌ను పోలీసులకు అందించానని తెలిపింది.