ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (18:10 IST)

తిరగబడరసామీ అంటున్న రాజ్ తరుణ్

Raj Tarun, AS Ravikumar Chaudhary, Malkapuram Sivakumar, Malvi Malhotra
Raj Tarun, AS Ravikumar Chaudhary, Malkapuram Sivakumar, Malvi Malhotra
హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తిరగబడరసామీ'. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామానాయడు స్టూడియోలో జరుగుతోంది. హీరో, హీరోయిన్, రాజా రవీంద్రపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 
 
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ..'తిరగబడరసామీ' మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్. రవికుమార్ చౌదరి గారి గత సినిమాల్లానే యాక్షన్ కామెడీ రోమాన్స్ ఎక్కడా తగ్గకుండా వుంటాయి. ఇవాళ రేపటి  తో  మొత్తం షూటింగ్ పూర్తవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ చివరి దశలో వున్నాయి. అతి త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సినిమాని అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. పైరసీని మాత్రం ప్రోత్సహించవద్దు’’ అని కోరారు.
 
దర్శకుడు ఎ ఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ, ఇది నా గత సినిమాలకు తగ్గకుండా వుంటుంది. ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్, నా మార్క్ ఎమోషన్ తో పాటు ఇందులో యూత్ ఫుల్ రోమాన్స్ కూడా టచ్ చేశాను. తిరగబడరసామీ యూత్ ఫుల్ ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఒక పాయింట్ గా చెప్పాలంటే.. ఒక బంధాన్ని నిలుపుకోవడం కోసం భార్య భర్తలు, ప్రేమికులు ఎంతవరకూ వెళ్తారనేది చాలా వినోదాత్మకంగా చూపించాం. చాలా అద్భుతమైన లోకేషన్స్ వుంటాయి. జోహార్ రెడ్డి గారు మంచి విజువల్స్ ఇచ్చారు. జేబీ బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. క్లైమాక్స్ లో వచ్చే పాట గూస్ బంప్స్ తెప్పిస్తుంది అని  తెలిపారు.
 
నిర్మాత  మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు రవికుమార్ చౌదరి గారు చెప్పిన కథ రాజ్ తరుణ్ కు యాప్ట్ గా వుంటుంది.  దాదాపు షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో వున్నాయి. ఈ సినిమా సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కి మంచి పేరు తీసుకొస్తుంది. రవికుమార్ చౌదరి గారి గత చిత్రాల్లానే  మంచి సినిమాగా నిలుస్తుంది. రాజ్ తరుణ్ గారి సినిమా చూపిస్తా మామ లాంటి విజయవంతమైన చిత్రాల కోవలోకే ఈ సినిమా కూడా చేరుతుంది. మాల్వీ మల్హోత్రా కి ఇది మొదటి సినిమా. ఇందులో  మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే కీలకమైన పాత్రలు పోషించారు. అలాగే నటీనటులందరూ చక్కని అభినయం కనబరిచారు. ఈ సినిమాని ఈ నెలాఖరకు గానీ వచ్చే నెల మొదటి వారంలో గానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు
 
మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. రాజ్ తరుణ్ కి జోడిగా నటించడం ఆనందంగా వుంది. ఇందులో చాలా క్యూట్ రోల్ లో కనిపిస్తా. డీవోపీ చాలా అందంగా చూపించారు. అందరూ కలసి మంచి టీం వర్క్ గా చేశాం. సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను’ అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో  రాజా రవీందర్,  డీఓపీ జవహర్ రెడ్డి, జబర్దస్త్ అప్పారావు, కమెడియన్ బద్రం, డైలాగ్ రైటర్ భాష్యశ్రీ పాల్గొన్నారు.