శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (17:06 IST)

ఆ ఇద్దరి దర్శకత్వంలో నటిస్తే చాలు : రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె తాజాగా తన మనసులోని మాటను వెల్లడించారు. ప్రముఖ దర్శకులు మణిరత్నం, ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేయాలని తనకు ఉందని, ఆ అవకాశం కోసం ఎదురు

తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె తాజాగా తన మనసులోని మాటను వెల్లడించారు. ప్రముఖ దర్శకులు మణిరత్నం, ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేయాలని తనకు ఉందని, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, దర్శకులు సుకుమార్, మురుగదాస్ దర్శకత్వంలో నటించానని, అదేవిధంగా మణిరత్నం, రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందని చెప్పింది. వారి సినిమాల్లో నటించడం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చని చెప్పింది. 
 
అయితే ఫలానా హీరోతో నటించాలనేదేమీ తనకు లేదని, స్క్రిప్ట్ బాగుంటే ఎవరితోనైనా నటిస్తానని, ‘గ్లామర్ డాల్’ అని పిలిపించుకోవడం తనకు ఇష్టం ఉండదని తెలిపింది. కాగా, గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సరసన రకుల్ నటించిన ‘విన్నర్’ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.